Andhra Pradesh: ఏపీ ప్రజలు కొత్తతరం నాయకుడిని కోరుకుంటున్నారు.. పవన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారు!: మాయావతి

  • పవన్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు
  • ముస్లింలను కాంగ్రెస్, బీజేపీలు మోసం చేశాయి
  • విశాఖలో మీడియా సమావేశంలో బీఎస్పీ అధినేత్రి

స్వాతంత్ర్యం తర్వాత ఎక్కువకాలం ఆంధ్రప్రదేశ్ ను పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టలేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. దీంతో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడంతో ఏపీ నష్టపోయిందన్నారు..

కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామన్న బీజేపీ కూడా మోసం చేసిందన్నారు. సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత ట్రాప్ లో పడకూడదని ఏపీ ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో పవన్ తో కలిసి మాయావతి మాట్లాడారు.

ఏపీ ప్రజలు ప్రస్తుతం కొత్తతరం నాయకుడిని కోరుకుంటున్నారని మాయావతి తెలిపారు. ప్రత్యేక హోదా కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడుతున్నారని చెప్పారు. తమ కూటమి తరఫున పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారన్నారు.

‘ముస్లిం వర్గాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకులా వాడుకుంటున్నాయి. ఇక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా అలానే చేస్తున్నాయి. ముస్లింల నిజమైన అభివృద్ధి ఒక్క జనసేన కూటమి ద్వారా మాత్రమే సాధ్యం’ అని మాయావతి స్పష్టం చేశారు.

More Telugu News