revathi: టీడీపీ తరపున సీనియర్ సినీనటి రేవతి ప్రచారం.. షెడ్యూల్ వివరాలు

  • టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా రేవతి
  • 4, 5 తేదీల్లో ఎన్నికల ప్రచారం
  • నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్న రేవతి

ఏపీలో టీడీపీ తరపున ప్రముఖ సినీ నటి రేవతి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి ఆమె ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హస్తకళల ఛైర్మన్ పాలి ప్రసాద్ వెల్లడించారు.

రేపు ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్ లో... సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెంలో రేవతి ప్రచారం నిర్వహిస్తారు. రాత్రికి పాలకొల్లులో బస చేస్తారు. 5వ తేది ఉదయం 9 గంటలకు పాలకొల్లులో, సాయంత్రం 4 గంటలకు నరసాపురం నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొననున్నారు. మరోవైపు, హీరో నారా రోహిత్ కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.

More Telugu News