varma: లక్ష్మీపార్వతిపై పుకార్లను పట్టించుకోలేదు .. నిజమని నేను నమ్మిందే సినిమాగా తీశాను: వర్మ

  • ఎవరికీ వ్యతిరేకంగా ఈ సినిమా తీయలేదు
  • పుకార్లను లెక్కలోకి తీసుకోలేం
  • పరిశోధన చేసిన తరువాతే రంగంలోకి దిగాను   

ఒకప్పుడు దెయ్యం .. మాఫియా .. ఫారెస్ట్ నేపథ్యాల్లో ఎక్కువ సినిమాలను తెరకెక్కించి తన ప్రత్యేకతను చాటుకున్న రామ్ గోపాల్ వర్మ, ఆ తరువాత వివాదాస్పదమైన కథాంశాలను తన సినిమాలకి కథా వస్తువుగా ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా లెక్కచేయకుండా తెరపై తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పేస్తున్నాడు. తాజాగా ఆయన వదిలిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు.

"లక్ష్మీపార్వతిపై ఎన్నో ఆరోపణలు వున్నాయి .. అలాంటి ఆమెను 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో ఒక దేవతగా చూపించడానికి కారణమేమిటనే ప్రశ్న వర్మకి ఎదురైంది. "అందుకు ఆయన స్పందిస్తూ .. " ఒకరికి ఫేవర్ గా .. మరొకరికి వ్యతిరేకంగా ఈ సినిమా చేయాలని నేను అనుకోలేదు. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజాలను చెప్పడానికి మాత్రమే ఈ సినిమా తీశాను. లక్ష్మీపార్వతి అలా చేసిందట .. ఇలా చేసిందట అని పదిమంది పది రకాలుగా చెబుతారు. దేనికీ సాక్ష్యాధారాలు వుండవు. అలాంటి పుకార్లను నమ్మి సినిమా తీయలేం. పరిశోధన చేసి .. నిజాలని నేను నమ్మిన వాటినే సినిమాలో చూపించాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News