Andhra Pradesh: బడుగు, బలహీనవర్గాలపై హామీల జల్లు.. మేనిఫెస్టోను ప్రకటించిన జనసేన పార్టీ!

  • పెట్టుబడి సాయం కింద రైతులకు రూ.8 వేలు అందజేత
  • కాపు రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక చర్యలు
  • ధాన్యం-పండ్ల అంతర్జాతీయ మార్కెట్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఈ రోజు మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రధానంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఎకరాకు రూ.8,000 అందిస్తామని జనసేన తెలిపింది. 60 ఏళ్లు పైబడిన చిన్న, సన్నకారు, కౌలు రైతులకు రూ. 5 వేలు పెన్షన్ అందిస్తామని పేర్కొంది. అలాగే 58 ఏళ్ల వయసు పైబడ్డ చేతి వృత్తులవారు, మత్స్యకారులకు రూ.5,000 పెన్షన్ అందిస్తామని పేర్కొంది. రైతుల కోసం గోదావరి బేసిన్ లో అంతర్జాతీయ ధాన్యం-పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

మేనిఫెస్టోలోని ఇతర కీలక అంశాలు..
1) రాయలసీమను పదేళ్ల పాటు కరవు ప్రాంతంగా గుర్తింపు
2)  ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం
3)  కోనసీమలో ఐఎంఎఫ్, జేఎంసీఏ వంటి సంస్థల ఆర్థిక సాయంతో ప్రపంచస్థాయి నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు
4) అమలాపురం-నరసాపురం-మచిలీపట్నం-కాకినాడ-తెనాలి కోస్తా రైల్వే లైను ఏర్పాటు
5) రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడం


6) రైతన్నలకు నాణ్యమైన విత్తనాలు, సాగునీటిని అందించడం కోసం ‘రైతు సంపద’ పథకం
7) ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా
8) జిల్లా ఆసుపత్రులన్నింటిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్పు
9) గిరిజన ప్రాంతాల్లో ప్రతి 5 ఊర్లకు ఓ అంబులెన్స్ ఏర్పాటు
10) రాబోయే ఐదేళ్లలో ఒక్కో జిల్లాలో 10 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడం


11) వార్షిక కేలండర్ ద్వారా ఏపీపీఎస్సీ ఉద్యోగ ఖాళీల భర్తీ
12) రూ.10,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు
13) ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ.2,000 కోట్ల ఫండ్
14)  సౌర, బయోగ్యాస్, పవన విద్యుత్ ఉత్పత్తిపై  దృష్టి
15) ఏపీ అసెంబ్లీలో 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు.



16) అమ్మాయిల పెళ్లి కోసం రూ.లక్ష వరకూ వడ్డీలేని రుణాలు
17) ‘ఆడపడుచు కానుక’ పేరిట  సంవత్సరానికి రూ.10,001, సారె, రెండు చీరలు అందజేత
18) పోలీస్ సిబ్బంది అందరికీ క్యాంటీన్ల ఏర్పాటు
19) ముస్లింల విషయంలో సచార్ కమిటీ సిఫార్సులు అమలు. కడపలో యునాని వైద్య కళాశాల ఏర్పాటు
20) రెల్లి యువతకు రూ.50 వేల వరకూ వడ్డీలేని రుణం. ఆటోరిక్షాల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ


21) రేషన్ కు బదులుగా ప్రతీకుటుంబానికి రూ.2500 నుంచి రూ.3500 నగదు బ్యాంకులో జమ. ఇంట్లోని మహిళల ఖాతాలో డిపాజిట్
22) సంవత్సరానికి 6 నుంచి 10 వరకూ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేత
23) ఎలాంటి పూచీకత్తు లేకుండానే చిరు వ్యాపారులకు రూ.10 వేల రుణం.
24) కొత్త జంటలకు ఉచిత గ్యాస్ స్టవ్
25) పాక్షిక దివ్యాంగుల ఫ్యామిలీకి నెలకు రూ.5 వేలు, పూర్తి దివ్యాంగులకు నెలకు రూ.10 వేల పెన్షన్ అందజేత


26) బీసీ రిజర్వేషన్లు 5 శాతం వరకూ పెంపు. అగ్రవర్ణాలకు కార్పొరేషన్ ఏర్పాటు. ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల విద్యార్థులకు హాస్టల్స్ ఏర్పాటు.
27) షెడ్యూల్ 9 ప్రకారం కాపులకు రిజర్వేషన్ కల్పించడానికి చర్యలు తీసుకుంటాం.
28) టూరిజం రంగంలో డిగ్రీ, డిప్లొమాలు అందించడానికి నాలుగు ప్రభుత్వ కాలేజీల  ప్రారంభం

More Telugu News