Mahesh Babu: భారీ రేటుకు 'మహర్షి' హిందీ డబ్బింగ్ రైట్స్

  • మహేశ్ కథానాయకుడిగా 'మహర్షి'
  • డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు 
  • అంతకంతకు పెరుగుతోన్న అంచనాలు        

మహేశ్ బాబు తాజా చిత్రంగా 'మహర్షి' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. షూటింగు పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. మే 9వ తేదీ విడుదల అని ముందుగానే చెప్పేయడం వలన, ఆ తేదీని దృష్టిలో పెట్టుకుని పనులు కానిచ్చేస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రేజ్ కి తగిన బిజినెస్ జరుగుతోంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు 11 కోట్లకి దక్కించుకున్నారు. శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ వారు 16.8 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ 26 కోట్లు పలికాయనేది తాజా సమాచారం. ఇది భారీ రేటేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కథాపరంగా మహేశ్ బాబు కాలేజ్ స్టూడెంట్ గా .. విదేశాల్లో ఓ సంస్థకి సీఈవోగా .. గ్రామీణ నేపథ్యంలో రైతుగా మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. మహేశ్ అభిమానులను మెప్పించే ప్రధానమైన అంశం ఇదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

More Telugu News