kajal: 'సీత'లోని పాయల్ ఐటమ్ సాంగ్ విడుదల రేపే

  • తేజ దర్శకత్వంలో రూపొందిన 'సీత'
  • ఐటమ్ సాంగ్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్ 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల  


 తేజ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రధారిగా 'సీత' సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించనున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు 'బుల్ రెడ్డి' అంటూ సాగే ఒక ఐటమ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారనేది తాజా సమాచారం. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి ఈ సాంగ్ ను వదలనున్నారు.

'ఆర్ ఎక్స్ 100' భామ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో ఈ ఐటమ్ సాంగ్ చేసింది. ఈ పాటలో ఆమె ఒక రేంజ్ లో అందాలను ఆరబోసిందని చెబుతున్నారు. పాటలో ఆమె 'ఆర్ ఎక్స్ 100' బైక్ ను కూడా నడుపుతుందని అంటున్నారు. ఈ ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఈ ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు. 'నేనే రాజు నేనే మంత్రి' తరువాత తేజ నుంచి వస్తోన్న ఈ సినిమా ఆయనకి మరో హిట్ ను ఇస్తుందేమో చూడాలి.

More Telugu News