samanta: చైతూ చేయడం వల్లనే ఈ రోజున ఈ ప్రశంసలు: సమంత

  • తమిళంలో హిట్ కొట్టిన 'సూపర్ డీలక్స్'
  • 'వేంబు' పాత్రలో మెప్పించిన సమంత
  •  సవాళ్లతో కూడిన పాత్రలకే ప్రాధాన్యత

తమిళంలో సమంత తాజా చిత్రంగా విడుదలైన 'సూపర్ డీలక్స్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ ను సమంత ఆస్వాదిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమాను గురించి ప్రస్తావించింది. 'సూపర్ డీలక్స్' చిత్రంలో బోల్డ్ గా కనిపించే 'వేంబు' పాత్రలో నటించాను. ఈ పాత్రను చేయడం వలన ఎలాంటి విమర్శలు వస్తాయోనని చాలా కంగారు పడ్డాను. కానీ ఈ పాత్రకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా చూసిన వాళ్లంతా అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ పాత్ర ఇంతటి పేరును తెచ్చిపెట్టడానికి కారకుడు చైతూ అనే చెప్పాలి. ఈ పాత్ర గురించి ఆయనకి చెప్పినప్పుడు .. చేయమని ప్రోత్సహించడం వల్లనే చేశాను. అందుకే ఈ క్రెడిట్ ఆయనకే వెళుతుంది. ఈ సినిమా హిట్ అయిందని తెలియగానే నాగార్జున మామయ్య ఫోన్ చేసి అభినందించారు. ఆయన తన కొడుకులిద్దరినీ ఎలా ప్రోత్సహిస్తారో .. నన్ను అంతే ప్రోత్సహిస్తారు. ఈ విజయం నాకు ప్రత్యేకం .. ఇకపై ఇలా సవాళ్లతో కూడిన పాత్రలనే చేస్తాను" అని చెప్పుకొచ్చింది.

More Telugu News