Chandrababu: అందుకే మేమంటే మీకు కుళ్లు: ప్రధానిపై చంద్రబాబు

  • నాకు పాఠాలు నేర్పిస్తారా?
  • రాజకీయాల్లోకి నేనెప్పుడొచ్చా.. మీరెప్పుడొచ్చారు?
  • అసలైన యూటర్న్ మీదే

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చిత్తూరులో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని తనపై చేసిన విమర్శలకు దీటుగా బదులిచ్చారు. రాజమండ్రిలో ప్రధాని చేసిన ప్రతీ విమర్శకు సమాధానం చెప్పిన చంద్రబాబు.. ప్రధాని తనకు పాఠాలు చెబుతాననడం, రాజకీయాలు నేర్పిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1970ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని, 2002లో రాజకీయాల్లోకి వచ్చిన మోదీ కాలం కలిసొచ్చి ప్రధాని పదవిలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు.

అమరావతిని అహ్మదాబాద్ కంటే అద్భుతంగా నిర్మిస్తున్నామన్న కుళ్లుతోనే తనపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనది యూటర్న్ కాదని, రైట్ టర్న్ అని చంద్రబాబు మరోమారు పేర్కొన్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తారన్న నమ్మకంతో మిత్రపక్షంగా ఉంటే దానిని తోసిపుచ్చి మోసం చేశారని అన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మర్చిపోయిన మీదే అసలైన యూటర్న్ అని ఆరోపించారు.

More Telugu News