chaitu: ఒక రేంజ్ లో దూసుకుపోతున్న 'మజిలీ' ట్రైలర్

  • నిన్న విడుదలైన 'మజిలీ' ట్రైలర్ 
  • పెరుగుతోన్న అంచనాలు
  • ఏప్రిల్ 5వ తేదీన భారీ విడుదల  

నాగచైతన్య .. సమంత జంటగా .. శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' నిర్మితమైంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది.

చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ కి 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ రావడం విశేషం. చైతూ .. సమంత పెళ్లి తరువాత చేసిన తొలి సినిమా కావడం వలన, ఈ సినిమా పట్ల భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా పట్ల ఏ స్థాయిలో ఆసక్తి వుందనడానికి ఉదాహరణంగా ఈ వ్యూస్ కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ వలన సినిమా విజయం పట్ల టీమ్ కి  మరింత నమ్మకం పెరిగింది.

More Telugu News