venkatesh: 'వెంకీమామ' కూడా దసరాకే బరిలోకి దిగుతాడట

  • తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న 'వెంకీమామ'
  • వెంకీ కూతురు పెళ్లి సందర్భంగా బ్రేక్ 
  • ఈ నెల 8 నుంచి రెండవ షెడ్యూల్

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీమామ' రూపొందుతోంది. 'జై లవకుశ'తో హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రాజమండ్రిలో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. వెంకటేశ్ కూతురు పెళ్లి పనుల కారణంగా కొన్ని రోజుల క్రితం బ్రేక్ ఇచ్చారు. ఆయన కూతురు పెళ్లికి సంబంధించిన పనులు పూర్తికావడంతో, రెండవ షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నెల 8వ తేదీ నుంచి షూటింగుకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలై నెల చివరివరకూ నాన్ స్టాప్ గా షూటింగు కొనసాగేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు. దసరా పండుగ రోజుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.

More Telugu News