isro: నింగికి ఎగిసిన పీఎస్ఎల్వీ-సి45

  • కొనసాగుతున్న ప్రయోగం
  • శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెడుతున్న శాస్త్రవేత్తలు
  • అంతా సజావుగా సాగుతున్న వైనం

ఇస్రో మరో రాకెట్ ప్రయోగం చేపట్టింది. భారత రక్షణ రంగ అవసరాల కోసం రూపొందించిన ఎమిశాట్ ఉపగ్రహం సహా మరో 28 నానో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ ను ఈరోజు ఉదయం 9.27 గంటలకు ప్రయోగించింది. ప్రాథమికంగా ప్రయోగం విజయవంతం అయినట్టు తెలుస్తున్నా, ఉపగ్రహాలన్నీ నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశించిన తర్వాతే ప్రయోగం పరిపూర్ణం అయినట్టు భావిస్తారు. ప్రస్తుతం రాకెట్ ప్రయోగ అనంతర దశలు కొనసాగుతున్నాయి.

కాగా, ఈసారి ప్రయోగంలో ప్రధానంగా ఎమిశాట్ ఉపగ్రహం గురించి చెప్పుకోవాలి. భారతదేశ రక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డీఆర్డీవో సంస్థ ఎమిశాట్ కు రూపకల్పన చేసింది. ఈ ప్రయోగంలో స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా, లిథువేనియా దేశాలకు చెందిన 28 నానో శాటిలైట్లను కూడా పీఎస్ఎల్వీ-సి45 రాకెట్ తనతో పాటు తీసుకెళ్లింది.

More Telugu News