johnson and johnson: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూలో క్యాన్సర్ కారక పదార్థాలు!

  • క్యాన్సర్ కారకాల గుర్తింపు
  • రాజస్థాన్ లో వెల్లడి
  • రెండు బ్యాచ్ ల ఉత్పత్తులపై నిషేధం

అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చిన్నారులకు సంబంధించిన ఉత్పత్తులకు పెట్టింది పేరన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సంస్థ తయారుచేస్తున్న బేబీ షాంపూలో హానికారక పదార్థాలున్నాయని పరిశీలనలో తేలింది. రాజస్థాన్ రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షించి చూడగా, వాటిలో ఫార్మాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారక పదార్థం ఉన్నట్టు తేలింది. దాంతో, రెండు బ్యాచ్ ల షాంపూ బాటిళ్లపై రాజస్థాన్ సర్కారు నిషేధం విధించింది. వాటిని మార్కెట్ నుంచి వెనక్కితీసుకోవాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా సదరు ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టిని సారించింది. నో మోర్ టియర్స్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న ఈ బేబీ షాంపూలు సురక్షితమైనవని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగానే తయారుచేస్తున్నామని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ చెబుతోంది.

More Telugu News