Mahabubnagar: కొత్త రెవెన్యూ చట్టం వస్తోంది..తొందరపడి రైతులెవ్వరూ లంచాలు ఇవ్వొద్దు: తెలంగాణ సీఎం కేసీఆర్

  • రైతుల భూమి రైతులకే ఉండేలా ఈ చట్టం
  • రెండు నెలల్లో ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి
  • పాసు పుస్తకాల్లోని 37 విభాగాలు తొలగించి మూడు   ఉంచాం

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తున్నామని, తొందరపడి రైతులెవ్వరూ సంబంధిత అధికారులకు లంచాలు ఇవ్వొద్దని కోరుతున్నానని సీఎం కేసీఆర్ విఙ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రవేశపెట్టబోయే రెవెన్యూ చట్టం యావత్తు దేశం నేర్చుకునేలా ఉంటుందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల్లోని 37 విభాగాలు తొలగించి మూడు విభాగాలు మాత్రమే ఉంచామని, ఈ పాసు పుస్తకాల్లో అలకతవకలకు పాల్పడితే సహించమని, రైతుల భూమి రైతులకే ఉండే విధంగా ఈ చట్టం తీసుకొస్తున్నట్టు వివరించారు. రెండు నెలల్లో ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రతిరోజూ జమాబందీ జరిగేలా చూస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

More Telugu News