Anantapur District: మేము అధికారంలోకి వస్తే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం: రాహుల్ గాంధీ

  • మేము అధికారంలోకి వస్తే పేదలను గుర్తిస్తాం
  • ‘న్యాయ్’ పథకంతో పేదల ఇబ్బందులు తొలగిస్తాం
  • రాఫెల్ డీల్ తో మోదీ రూ.35 వేల కోట్లు దోచుకున్నారు

ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే పేదరికంపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ప్రతి రాష్ట్రంలోని పేదలను గుర్తించి ఆదుకుంటామని, ‘న్యాయ్’ పథకంతో పేదల ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు. రాఫెల్ డీల్ తో మోదీ రూ.35 వేల కోట్లు దోచుకున్నారని, చౌకీదార్ అని చెప్పుకునే ప్రధాని, ఆ సొమ్మును దోచుకుని పెద్దలకు పంచుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ గురించి ఆయన ప్రస్తావించారు. ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పది రోజుల్లోనే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

More Telugu News