Telangana: తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు టీఆర్ఎస్ వే.. వీడీపీ అసోసియేట్స్ సర్వే ఫలితాల ప్రకటన!

  • చెరో స్థానంలో మజ్లిస్, కాంగ్రెస్ విజయం
  • జనసేనకు తెలంగాణలో 0.40 శాతం ఓట్లు దక్కే ఛాన్స్
  • సర్వేపై స్పందించిన టీఆర్ఎస్ నేత కేటీఆర్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్  కు ఎదురులేదని వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన నేషనల్ ట్రాకర్ పోల్ సర్వేలో తేలింది. ఈ లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 15 స్థానాలు దక్కించుకుంటుందని సర్వే తెలిపింది. ఇక టీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీ ఓ సీటును దక్కించుకుంటుందనీ, కాంగ్రస్ పార్టీకి మరోస్థానం దక్కుతుందని అంచనా వేసింది.

ఇటీవల డీకే అరుణ సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరినప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో గెలిచే అవకాశం లేదని చెప్పింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 44.62 శాతం ఓట్లు దక్కే అవకాశముందని సర్వేలో తేలింది. అలాగే కాంగ్రెస్ పార్టీ 30.1 శాతం, బీజేపీ 13.79 శాతం, మజ్లిస్ 4.70 శాతం, సీపీఎం 0.72 శాతం, సీపీఐ 0.63 శాతం, జనసేన 0.40 శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది.

ఇతరులు మరో 5 శాతం ఓట్లను దక్కించుకుంటారని చెప్పింది. కాగా, ఈ సర్వేపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ప్రజల ఆశీర్వాదంతో తాము 16 సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News