బ్రహ్మి ‘లవంగం’ పాత్రలో వెన్నెల కిషోర్

30-03-2019 Sat 21:04
  • రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సీక్వెల్‌
  • హీరోయిన్‌గా రకుల్ ప్రీత్
  • పోర్చుగల్‌లో చిత్రీకరణ ప్రారంభం
నాగార్జున, సోనాలి బింద్రే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా సీక్వెల్‌కు సిద్ధమవుతోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఏప్రిల్‌లో పోర్చుగల్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సినిమాను నాగార్జున, జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక మన్మథుడు చిత్రంలో ‘లవంగం’ పాత్రను మాత్రం ఎవరూ మరువలేరు. ఈ పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బ నవ్వించారు. అయితే ‘మన్మథుడు’ సీక్వెల్‌లో కూడా లవంగం పాత్ర ఉంది. అయితే ఆ పాత్రలో ప్రస్తుతం వెన్నెల కిషోర్ నటించబోతున్నాడు. ప్రస్తుతం నాగ్, కిషోర్‌ల మధ్య సన్నివేశాల రూపకల్పన జరుగుతోందని సమాచారం.