Ramakrishna Babu: ప్రచారంలో ప్రమాదం.. స్వల్ప గాయాలతో బయటపడిన టీడీపీ అభ్యర్థి

  • కార్యకర్తలతో కలిసి ప్రచారం
  • పెద్ద ఎత్తున బాణసంచా పేల్చిన అభిమానులు
  • ఒక్కసారిగా పేలిన గ్యాస్ బెలూన్

టీడీపీ అభ్యర్థికి తృటిలో పెను ప్రమాదం తప్పి, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విశాఖ జిల్లాలోని తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి రామకృష్ణబాబు నేడు తన కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ నేపథ్యంలో టపాసులు అక్కడే ఉన్న గ్యాస్ బెలూన్‌పై పడటంతో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ఘటనలో రామకృష్ణబాబుకు స్వల్ప గాయాలవడంతో ప్రథమ చికిత్స చేయించుకుని యథావిధిగా ప్రచారంలో పాల్గొన్నారు.

More Telugu News