nirav modi: కుక్కను కూడా చూసుకోవాలి.. నీరవ్ కు బెయిల్ ఇవ్వండి: లండన్ కోర్టులో విచిత్రమైన వాదన

  • నీరవ్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న న్యాయవాదులు
  • సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ ప్రాసిక్యూషన్ వాదన
  • బెయిల్ నిరాకరించిన న్యాయమూర్తి

బ్రిటన్ లో అరెస్టైన భారత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బెయిల్ ఇప్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో తమ వాదనలను వినిపిస్తూ... నీరవ్ కుమారుడు విశ్వవిద్యాలయానికి వెళ్లాల్సి ఉందని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిండ్రులను ఆయనే చూసుకోవాలని, పెంపుడు కుక్క సంరక్షణను కూడా చూసుకోవాలని చెప్పారు.

నీరవ్ ఎక్కడకీ పారిపోరని, ఎక్కడికైనా వెళ్లేందుకు కానీ, నివసించేందుకు కానీ ఆయన దరఖాస్తు చేసుకోలేదని తెలిపారు. బ్రిటన్ లో ఉండేందుకు ఆయన అర్హత సాధించారని చెప్పారు. ఈ వాదనను భారత్ తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ కొట్టేసింది. నీరవ్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో, నీరవ్ కు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు.

More Telugu News