ఉరవకొండలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన 65 కుటుంబాలు

30-03-2019 Sat 14:23
  • గత ఎన్నికల్లో ఓడిపోయిన పయ్యావుల
  • ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైనం
  • పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 65 కుటుంబాలు పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీలో చేరాయి. గత ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేస్తున్నారు. నియోజకవర్గమంతా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.