Kanvar Singh: ప్రధాని పథకాన్ని ప్రశంసించి చిక్కుల్లో పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

  • పీఎంఈవై పథకం ప్రయోజనకరం
  • ఇల్లు నిర్మించుకునేందుకు కృషి
  • రూ.2.2 లక్షలు మంజూరు

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఈవై) పథకాన్ని ప్రశంసించి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కులపాలయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కన్వర్ సింగ్ నిషాద్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పదవి చేపట్టక ముందు కన్వర్ ఓ పూరి గుడిసెలో నివసించేవారు. ప్రస్తుతం ఆయన తండ్రి పీఎంఈవై పథకం ద్వారా పక్కా భవనాన్ని నిర్మించుకున్నారు.

ఈ విషయం గుర్తుకు వచ్చిందో ఏమో కానీ, మీడియా సమావేశంలో సొంతిల్లు లేని పేదవారికి పీఎంఈవై పథకం ప్రయోజనకరంగా ఉందని కొనియాడారు. అర్హులైన లబ్దిదారులందరూ ఈ పథకం ద్వారా పక్కా భవనాలను నిర్మించుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పక్కా ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.2 లక్షలు మంజూరు చేస్తుందని కన్వర్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సమయంలో కన్వర్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News