sensex: ఎన్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 127 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 54 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 3 శాతంపైగా లాభపడ్డ వేదాంత

ఈ వారాన్ని స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. ఎన్టీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలతో విదేశీ పెట్టుబడులు మార్కెట్లలోకి తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 127 పాయింట్లు లాభపడి 38,673కు పెరిగింది. నిఫ్టీ 54 పాయింట్లు లాభపడి 11,624కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత (3.20%), టాటా స్టీల్ (2.73%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.27%), టాటా మోటార్స్ (2.17%), ఓఎన్జీసీ (1.66%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.08%), ఐటీసీ (-1.10%), బజాజ్ ఆటో (-0.89%), యాక్సిస్ బ్యాంక్ (-0.79%), ఏషియస్ పెయింట్స్ (-0.58%).

More Telugu News