Telangana: తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 20 వేలు భర్తీచేసి చేతులు దులుపుకుంటారా?: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

  • ఇప్పటివరకూ ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వలేదు
  • కానీ ఏపీలో ఉద్యోగులకు 20 శాతం ప్రకటించారు
  • గాంధీ భవన్ లో మీడియాతో కాంగ్రెస్ నేత

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కానీ కేవలం 20,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసి కేసీఆర్ ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామన్న హామీని కేసీఆర్ ఇంకా నిలబెట్టుకోలేదని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగులు, విద్యావంతుల్లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు.

More Telugu News