Andhra Pradesh: చంద్రబాబు గూబగుయ్యిమనేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది!: జీవీఎల్ సెటైర్లు

  • రాజ్యాంగ సంస్థలతో తలబిరుసుగా ప్రవర్తిస్తే భంగపాటు తప్పదు
  • మంచిగా చెప్పినా చంద్రబాబు పెడచెవిన పెట్టారు
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత

రాజ్యాంగ సంస్థలతో తలబిరుసుగా ప్రవర్తిస్తే భంగపాటు తప్పదని చెప్పినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెడచెవిన పెట్టారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు గూబ గుయ్యిమనిపించేలా  తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలపై, రాజకీయాలపైన ఉన్న అవగాహనతో ఈ విషయాన్ని తాను ముందుగానే చెప్పానన్నారు. కానీ ఈ విషయంలో చంద్రబాబు గారి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏమయిందని ప్రశ్నించారు.

ఈరోజు జీవీఎల్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘రాజ్యాంగ సంస్థలతో తలబిరుసుగా ప్రవర్తిస్తే చంద్రబాబు నాయుడు గారికి భంగపాటు తప్పదు అని మంచిమాటలు చెప్పినా పెడిచెవిన పెట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గూబగుయ్యిమనిపించేలా తీర్పు ఇచ్చింది. రాజకీయాలపైన, రాజ్యాంగ వ్యవస్థపైన ఉన్న అవగాహనతో చెప్పా. మరి మీ 40 ఏళ్ళ అనుభవం ఏమైంది బాబు? @ncbn’ అని ట్వీట్ చేశారు.

ఏపీలో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాలుచేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీనిపైనే తాజాగా జీవీఎల్ స్పందించారు.

More Telugu News