గెలిస్తే అన్న రాహుల్ దే ప్రధాని పదవి... స్పష్టం చేసిన ప్రియాంక వాద్రా
- అమేథీ పర్యటన సందర్భంగా తేల్చిచెప్పిన ప్రియాంక
- ఇప్పటి వరకు దీనిపై ప్రకటన చేయని గాంధీ కుటుంబం
- ఆ విషయం ప్రస్తావించని రాహుల్
గాంధీ కుటుంబం నుంచి ఇటువంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం అన్న సొంత నియోజకవర్గమైన అమేథీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకవాద్రా 2019లో గెలిస్తే రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని విస్పష్ట ప్రకటన చేశారు. విపక్ష కూటమిలోని పలు పార్టీల నేతలు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా పేర్కొన్నప్పటికీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఈ విషయంపై నోరు మెదపలేదు.