NTR: చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.. నా కొడుకుతో పంచుకుంటా: ఎన్టీఆర్

  • అమర చిత్ర కథ కామిక్స్‌ నిధి దొరికింది
  • రానా దగ్గుబాటికి ధన్యవాదాలు
  • పుస్తకాలను షేర్ చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్  ఎన్టీఆర్‌కు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయట. అంతేకాదు వాటిని తన కొడుకుతో పంచుకుంటాడట. ఏంటిది సడెన్‌గా అంటారా? ప్రముఖ నటుడు రానా ‘అమర చిత్ర కథ’ పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కార్నివాల్ రామానాయుడు స్టూడియోలో ఈ నెల 31న సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో తారక్, ‘అమర చిత్ర కథ’ పుస్తకాలను షేర్ చేసి రానాకు ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. అమర చిత్ర కథ కామిక్స్‌ నిధి దొరికినందుకు, నా చిన్ననాటి జ్ఞాపకాలను అభయ్‌తో పంచుకునేందుకు అవకాశం కల్పించిన రానా దగ్గుబాటికి ధన్యవాదాలు’ అని తారక్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ శిక్షణ కేంద్రంలో చిన్నారులకు ఆర్ట్, డిజైన్, జీవన నైపుణ్యాలు, వేదిక్ సైన్స్‌పై శిక్షణ ఇవ్వనున్నారు.

More Telugu News