Rahul Gandhi: రాహుల్ చిన్నపిల్లాడు.. అతని వ్యాఖ్యలపై కామెంట్ చేయను!: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెటకారం

  • మమత సర్కారుపై రాహుల్ విమర్శలు
  • రైతులు, నిరుద్యోగులకు ఏమీ చేయలేదని విమర్శ
  • రాహుల్ చిన్నపిల్లాడన్న మమత

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చిన్నపిల్లాడిగా అభివర్ణించారు. ఆయన చేసే విమర్శలపై తాను కామెంట్ చేయబోనని స్పష్టం చేశారు. ఈ నెల 23న రాహుల్ కోల్ కతాలో పర్యటిస్తూ, తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, రైతుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. మమతా బెనర్జీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఎండగట్టారు. తాజాగా ఈ విషయమై మీడియా ప్రశ్నించడంతో మమతా బెనర్జీ స్పందిస్తూ, ‘చిన్నపిల్లాడు ఏదో అన్నాడు. దానిపై నేను కామెంట్ చేయను’ అని వెటకారంగా స్పందించారు.

More Telugu News