mayawati: కాంగ్రెస్ కనీస ఆదాయ పథకంపై విరుచుకుపడిన మాయావతి .. బీజేపీ ఆరోపణలు నిజమేనన్న బీఎస్పీ చీఫ్!

  • తాము అధికారంలోకి వస్తే పేదలకు ఏడాదికి రూ.72 వేలు ఇస్తామన్న రాహుల్
  • బీజేపీ ఆరోపణలు సమర్థిస్తూనే కాంగ్రెస్‌పై మాయా మండిపాటు 
  • అబద్ధపు హామీలు ఇవ్వడంలో దొందూదొందేని విమర్శ

పేదరికంపై సర్జికల్ స్ట్రయిక్స్‌గా కాంగ్రెస్ చెప్పుకుంటున్న కనీస ఆదాయ పథకం (న్యాయ్)పై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకం విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందంటూనే బీజేపీపైనా విరుచుకుపడ్డారు. అసత్య హామీలు ఇవ్వడంలో బీజేపీది కూడా అందెవేసిన చెయ్యేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయంలో ఒకే గూటి పక్షులని తీవ్ర విమర్శలు చేశారు. పేదలు, రైతులు, కార్మికుల విషయంలో ఈ రెండు పార్టీలు నిర్లక్ష్య ధోరణితోనే ఉన్నాయని ఆరోపించారు.  

తాము అధికారంలోకి వస్తే పేదలకు కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటించారు. పేదరికంపై సర్జికల్ స్ట్రయిక్‌గా దీనిని అభివర్ణించిన రాహుల్.. పేదలకు ఏడాదికి రూ.72 వేలు చొప్పున ఇస్తామని పేర్కొన్నారు. ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ఆర్థికవేత్తలతో చర్చించిన మీదటే దీనిని ప్రకటించినట్టు రాహుల్ తెలిపారు.  

More Telugu News