Congress: కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం విడ్డూరంగా ఉంది : సునీతాలక్ష్మారెడ్డి

  • రాజీనామా చేశాక సస్పెండ్‌ చేయడం ఏమిటి?
  • టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్న మాజీ మంత్రి
  • అనుచరుల నిర్ణయం మేరకే అని ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయం విడ్డూరంగా ఉందని, తాను పార్టీకి రాజీనామా చేశాక తనను సస్పెండ్‌ చేయడం ఏమిటో కమిటీ సభ్యులే చెప్పాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సునీతా లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవి నిర్వహించిన సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించారు. తన అనుచరులు, సన్నిహితులు, అభిమానుల సూచన మేరకే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. ఇది అర్థంలేని చర్యని మండిపడ్డారు.

More Telugu News