Train Tickets: రైలు టికెట్లు, బోర్డింగ్ పాస్ లపై మోదీ చిత్రాలు... సీరియస్ గా తీసుకున్న ఈసీ!

  • మార్చి 10 నుంచి అమలులోకి వచ్చిన కోడ్
  • రెండు వారాలు దాటినా ఇంకా మోదీ చిత్రాలు
  • మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత కూడా రైలు టికెట్లపై, ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్ లపై నరేంద్ర మోదీ చిత్రాలను ఎందుకు ముద్రిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఈ ఉదయం రైల్వే మంత్రిత్వ శాఖకు, పౌరవిమానయాన శాఖకూ ఈసీ తాఖీదులు పంపింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత రాజకీయ నాయకుల చిత్రాలు, వారి పేర్లు, పార్టీ గుర్తులు ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ఖర్చుతో ప్రచారం చేసుకునే వీల్లేదని గుర్తు చేసింది. ప్రభుత్వ భవనాలపై కూడా సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోరాదని తెలిపింది. మార్చి 10 నుంచి కోడ్ అమలులోకి వచ్చిందని, కోడ్ అమలులోకి వచ్చి రెండు వారాల సమయం దాటుతున్నా, నరేంద్ర మోదీ చిత్రాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని చెబుతూ, నోటీసులు జారీ చేసింది.

More Telugu News