MCC: 'మన్కడింగ్'పై కీలక రూలింగ్ ఇచ్చిన ఎంసీసీ!

  • బట్లర్ ను 'మన్కడింగ్' చేసిన అశ్విన్
  • నిబంధనలకు అనుగుణంగానే అవుట్
  • 'మన్కడింగ్' లేకుంటే నాన్ స్ట్రయికర్ సగం దూరం వెళ్లి నిలుచుంటాడు.
  • క్రీజ్ దాటితే హెచ్చరించకుండానే అవుట్ చేయవచ్చన్న ఎంసీసీ

రెండు రోజుల క్రితం ఐపీఎల్ మ్యాచ్ లో తాను బాల్ వేయకముందే జోస్ బట్లర్ క్రీజ్ ను దాటాడన్న కారణంతో 'మన్కడింగ్' చేసిన రవిచంద్రన్ అశ్విన్ కు క్రికెట్ నిబంధనల సృష్టికర్త ఎంసీసీ (మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్) అండగా నిలిచింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, 'మన్కడింగ్' నిబంధన తప్పనిసరని, ఆటలో భాగమేనని స్పష్టం చేస్తూ రూలింగ్ ఇచ్చింది.

ఈ పద్ధతిలో ఓ ఆటగాడిని అవుట్ చేయడం నిబంధనలకు అనుగుణంగా జరిగేదేనని, బాల్ వేయకముందు క్రీజ్ దాటరాదన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని, దాటితే అవుట్ చేయవచ్చని స్పష్టం చేసింది. ఇదే నిబంధన లేకుంటే, నాన్ స్ట్రయికర్ బ్యాట్స్ మన్ బాల్ వేయకముందే క్రీజ్ ను దాటి చాలా దూరం వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. ఆటగాడు పిచ్ మధ్య వరకూ వెళ్లి నిలుచుంటే ఎలాగని ప్రశ్నించింది. ఈ తరహా ఔట్ పై క్రికెట్ నిబంధనల చట్టంలోని 41.16 నిబంధన స్పష్టంగా ఉందని తెలిపింది. బ్యాట్స్ మెన్ క్రీజ్ దాటితే ఓ మారు హెచ్చరించాలన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొంది.

More Telugu News