paruchuri: అర్థరాత్రి వేళ అన్నగారితో గెస్టు హౌస్ ఖాళీ చేయించారు: పరుచూరి గోపాలకృష్ణ

  • అన్నగారు నెల్లూరు గెస్టు హౌస్ లో వున్నారు
  • రాత్రివేళ వర్షంలో ఒక మంత్రిగారు వచ్చారు
  • అప్పుడు అన్నగారు ఆ మాట అన్నారు

ఎన్టీ రామారావు కెరియర్లో చెప్పుకోదగిన కొన్ని సినిమాలకి కథా రచయితలుగా పరుచూరి బ్రదర్స్ పనిచేశారు. ఎన్టీఆర్ తో వాళ్లకు ఎంతో అనుబంధం వుంది. 'అన్నగారు' అని ఆప్యాయంగా పిలుస్తూనే వాళ్లు ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ కి ఎదురైన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చారు.

"ఓ రోజున అన్నగారు నెల్లూరులోని ఒక గెస్టు హౌస్ లో వున్నారు. ఆ రాత్రి వర్షం పడుతుండగా .. ఒక మంత్రిగారు వచ్చారు. మంత్రిగారికి ఇవ్వాలని చెప్పేసి ఎన్టీఆర్ ను గెస్టు హౌస్ ను ఖాళీ చేయమన్నారు. ప్రభుత్వ గెస్టు హౌస్ కావడం వలన మంత్రికి ఇచ్చి తీరాలని అన్నారు. 'మరో రెండు .. మూడు గంటలైతే తెల్లారిపోతుంది .. మేం వెళ్లిపోతాం' అని ఎన్టీఆర్ గారు చెప్పినా వాళ్లు వినిపించుకోలేదు.

ఎన్టీఆర్ చాలా నొచ్చుకుని .. అక్కడి నుంచి వెళ్లిపోతూ, 'వస్తాం .. ఇదే గెస్టు హౌస్ కి వస్తాం .. నటుడు రామారావుగా కాదు .. ముఖ్యమంత్రి రామారావుగా' అని అన్నారు. అన్నట్టుగానే ఆయన ముఖ్యమంత్రి కాగానే మొదటిసారిగా నెల్లూరు వెళ్లినప్పుడు .. ముందుగా వెళ్లింది ఆ గెస్టు హౌస్ కే" అని చెప్పుకొచ్చారు.

More Telugu News