dinakaran: గుర్తు కేటాయింపు విషయంలో.. దినకరన్ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీమ్

  • సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన టీటీవీ దినకరన్
  • 'ప్రెషర్ కుక్కర్' గుర్తును కేటాయించమని అభ్యర్థన
  • తిరస్కరించిన ధర్మాసనం

తమిళనాడులోని 'అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం' (ఏఎంఎంకె) పార్టీకి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. పార్టీ నేత టీటీవీ దినకరన్ తమ పార్టీకి 'ప్రెషర్ కుక్కర్' గుర్తును కేటాయించాలని కోరుతూ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ .. జస్టీస్ దీపక్ గుప్తా .. జస్టీస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం, దినకరన్ చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.

ఏఎంఎంకె పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపును ఇవ్వని పక్షంలో, అవకాశం వుంటే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఒకే గుర్తును కేటాయించే అంశాన్ని పరిశీలించాలనీ .. ప్రస్తుతానికి వాళ్లను స్వతంత్రులుగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి ధర్మాసనం సూచించింది. ఒక పార్టీకి గుర్తింపు ఇవ్వాలా? లేదా? అనే విషయం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. 

More Telugu News