chaitu: 'మజిలీ' నుంచి 'మాయ్యా .. మాయ్యా' వీడియో సాంగ్ రిలీజ్

  • శివ నిర్వాణ నుంచి 'మజిలీ'
  • ముఖ్యమైన పాత్రలో దివ్యాన్ష కౌశిక్ 
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల      

నాగచైతన్య .. సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా నిర్మితమైంది. విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ ను వదులుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'మాయ్యా .. మాయ్యా' అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

చైతూ పాత్ర స్వరూప స్వభావాలను ఈ పాట ద్వారా ఆవిష్కరించారనే చెప్పాలి. చైతూ తన స్నేహితులతో కలిసి ఆడిపాడే దృశ్యాలతో ఈ పాట ఆకట్టుకునేలా వుంది. దివ్యాన్ష కౌశిక్ మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో చైతూ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. చైతూ .. సమంత పెళ్లి తరువాత వస్తోన్న తొలి సినిమా కావడంతో అందరిలో ఆసక్తి వుంది

More Telugu News