YSRCP: వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే జగన్ ని చూసేందుకు జనాలొస్తున్నారు: ఎంపీ రాయపాటి

  • జగన్ కు ఓటు బ్యాంక్ లేదు
  • వైసీపీకి క్యాడర్ లేదు
  • ఆ పార్టీకి ఓట్లు వేసే వాళ్లూ లేరు

నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మంచి పనుల వల్లే ఈరోజున జగన్ ని చూసేందుకు జనం వస్తున్నారు తప్ప, ‘ఆయనకు ఓటు బ్యాంక్’ లేదని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శించారు. ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ ఓట్లు తమకు పడతాయని వైసీపీ ఎంతో నమ్మకంగా చెబుతోందన్న ప్రశ్నకు రాయపాటి స్పందిస్తూ, అవన్నీ అబద్ధాలని అన్నారు.

వైసీపీకి క్యాడర్ లేదని, ఆ పార్టీకి ఓట్లు వేసే వాళ్లూ లేరని అభిప్రాయపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ఓటేస్తే తమ ఆస్తులు పోతాయని ఓటర్లు భయపడుతున్నారని విమర్శించారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీకీ క్యాడర్ లేదని, ఓటు బ్యాంక్ ఛిన్నాభిన్నమై పోయిందని అన్నారు. టీడీపీకి అద్భుతమైన క్యాడర్ ఉందని, డెబ్బై ఐదు శాతం ఓటు బ్యాంక్ ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి 150 సీట్లకు తగ్గకుండా వస్తాయని, ఈ విషయాన్ని రాసిపెట్టుకోవచ్చంటూ రాయపాటి ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News