Jitender Reddy: మోదీతో కలిసి హెలికాప్టర్ ఎక్కనిస్తే బీజేపీలో చేరుతా... రామ్ మాధవ్ కు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కండిషన్!

  • మరోసారి టికెట్ తెచ్చుకోలేకపోయిన జితేందర్ రెడ్డి
  • నిన్న రాత్రి రామ్ మాథవ్ తో మంతనాలు
  • మూడు డిమాండ్లు బీజేపీ ముందుంచిన ఎంపీ

మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీగా ఉండి, మరోసారి టీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోలేకపోయిన జితేందర్ రెడ్డి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. నిన్న రాత్రి ఆ పార్టీ నేత రామ్ మాధవ్ తో సుదీర్ఘంగా మంతనాలు సాగించిన ఆయన, తాను బీజేపీలో చేరాలంటే కొన్ని కోరికలు తీర్చాలని అడిగినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వడం, 29న తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ కు వెళ్లే సమయంలో, హైదరాబాద్ నుంచి తనను కూడా మోదీ ప్రయాణించే చాపర్ లో మహబూబ్ నగర్ కు పంపడం, ఏదైనా ఓ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం... ఈ మూడు డిమాండ్లనూ జితేందర్ రెడ్డి బీజేపీ ముందుంచగా, తొలి రెండు డిమాండ్లకూ రామ్ మాధవ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.

కాగా, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని జితేందర్ రెడ్డిపై ఆరోపణలు రాగా, మరోమారు టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 

More Telugu News