Jana sena: బాపట్ల జనసేనలో తికమక.. పార్టీ నుంచి ముగ్గురి నామినేషన్

  • తొలుత నామినేషన్ వేసిన పులుగు మధుసూదన్ రెడ్డి
  • సోమవారం నామినేషన్ వేసిన లక్ష్మీనారాయణ సన్నిహితుడు
  • పార్టీ అభ్యర్థిని నేనేనంటూ మరో నేత కూడా నామినేషన్

గుంటూరు జిల్లా బాపట్ల జనసేనలో గందరగోళం నెలకొంది. బాపట్ల అసెంబ్లీ స్థానం నుంచి పార్టీకి చెందిన ముగ్గురు నేతలు నామినేషన్ వేయడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక జనసేన శ్రేణులు తికమకలో ఉన్నాయి. పార్టీ నుంచి బీ-ఫారం అందుకున్న రైల్వే కాంట్రాక్టర్ అయిన పులుగు మధుసూదన్‌రెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు.

అయితే, ఆయనపై ఆరోపణలు రావడంతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సన్నిహితుడైన ఇక్కుర్తి లక్ష్మీనరసింహకు టికెట్ ఇచ్చి మధుసూదన్‌రెడ్డి బీ-ఫారంను రద్దు చేశారు. దీంతో సోమవారం లక్ష్మీనరసింహ నామినేషన్ వేశారు. అయితే, పార్టీ నుంచి బీ-ఫారం లేకపోయినప్పటికీ తానే అభ్యర్థినంటూ ఆ పార్టీకి చెందిన మరో నేత బీకే నాయుడు కూడా నామినేషన్ వేశారు. ఇలా ఒకే పార్టీ నుంచి ముగ్గురు నేతలు బరిలో ఉండడంతో జనసేన శ్రేణులు తికమకపడుతున్నాయి.

More Telugu News