thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • టర్కీలో తమన్నా సినిమా షూటింగ్ 
  • బాలకృష్ణ, రాజశేఖర్ సినిమాపై వివరణ 
  • హెబ్బా పటేల్ రెచ్చిపోతుందట! 

*  విశాల్, తమన్నా జంటగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. సుందర్ సి దర్శకత్వం వహించే ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ త్వరలో టర్కీలో మొదలవుతుంది. సుమారు ఏభై రోజుల పాటు అక్కడ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  తమిళంలో విజయం సాధించిన 'విక్రం వేద' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు, ఇందులో బాలకృష్ణ, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో వాస్తవం లేదని 'విక్రం వేదం' తమిళ చిత్రం నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులు ఎవరూ తీసుకోలేదని, తమ వద్దే వున్నాయని చెప్పారు.
*  '24 కిస్సెస్' చిత్రం తర్వాత కథానాయిక హెబ్బా పటేల్ తెలుగులో 'రాడికల్' అనే చిత్రంలో నటిస్తోంది. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కొన్ని హాట్ సీన్స్ లో నటించడానికి హెబ్బా పటేల్ అంగీకరించిందట.

More Telugu News