jayaprada: బీజేపీ వైపు జయప్రద చూపు!

  • రాజకీయాల్లో చురుకైన పాత్ర 
  • గతంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరణ 
  • బీజేపీలో చేరుతున్నటుగా సమాచారం

సాధారణ ఎన్నికల సందర్భంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు విపరీతంగా జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో, ఒకప్పుడు వెండితెరపై అందాల కథానాయికగా ఒక వెలుగు వెలిగిన జయప్రద తాజాగా బీజేపీలో చేరనున్నట్టు వార్తలొస్తున్నాయి. తొలినాళ్లలో తెలుగు దేశం పార్టీలో చురుకైన పాత్రను పోషించిన ఆమె, ఆ తరువాత సమాజ్ వాదీ పార్టీలో చేరి, 2004 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ లోని 'రామ్ పూర్' నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అయితే ఆ తరువాత కొంతకాలానికి .. అంటే 2010లో ఆమె ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం ..పార్టీ చేత బహిష్కరించబడి బయటికి రావడం జరిగిపోయాయి. ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానానికి కొనసాగింపుగా ఆమె భారతీయ జనతా పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. విశేషం ఏమిటంటే, గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన 'రామ్ పూర్' నియోజక వర్గం నుంచే జయప్రదను బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. 

More Telugu News