akhil: ప్రియాంక జవాల్కర్ చేజారిన అఖిల్ మూవీ ఛాన్స్

  • 'టాక్సీవాలా'తో హిట్ 
  • మంచి పాత్రల కోసం నిరీక్షణ
  • అభిమానుల్లో నిరాశ          

తెలుగు తెరకి ' టాక్సీవాలా' చిత్రం ద్వారా ప్రియాంక జవాల్కర్ పరిచయమైంది. తొలి సినిమాతోనే ఈ అనంతపురం అమ్మాయి హిట్ కొట్టేయడం విశేషం. గ్లామర్ పరంగా యూత్ నుంచి మంచి మార్కులు తెచ్చుకున్న ఈ అమ్మాయి, వరుస సినిమాలతో దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ మంచి కథలు .. పాత్రలు వస్తేనే చేయాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి వెయిట్ చేస్తూ కూర్చుంది.

అఖిల్ 4వ సినిమా కోసం ప్రియాంక జవాల్కర్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. గీతా ఆర్ట్స్ వారు 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక జవాల్కర్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ అవకాశం ఆమె చేజారిపోయినట్టేననే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నారనే వార్త ప్రియాంక అభిమానులను నిరాశ పరిచేదే. ఈ ఛాన్స్ ఏ హీరోయిన్ కి వెళ్లేది త్వరలోనే తేలనుంది.

More Telugu News