mahatma: మహాత్మా గాంధీ ఏయే వ్యాధులతో బాధపడ్డారు? ఏ ఆపరేషన్లు చేయించుకున్నారు?.. తొలిసారి వెలుగులోకి వచ్చిన హెల్త్ రికార్డులు

  • గాంధీ బరువు 46.7 కేజీలు
  • సుదీర్ఘకాలం బీపీతో బాధపడ్డ మహాత్మా
  • పైల్స్, అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయి

ఏడు పదుల వయసులో కూడా ఎంతో చురుకుగా ఉన్న మహాత్మాగాంధీ మనందరికీ తెలుసు. బోసినవ్వు తప్ప, ఏనాడూ ఆయన ముఖంలో అలసట అనేది మచ్చకు కూడా కనిపించలేదు. తాజాగా, చరిత్రలో తొలిసారి మహాత్మాగాంధీకి చెందిన హెల్త్ రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ధర్మశాలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, దలైలామాలు 'గాంధీ అండ్ హెల్గ్ @ 150' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. గాంధీ అందరిలాగానే అనారోగ్యంతో బాధపడ్డారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పాటు ఆయన బీపీతో ఇబ్బంది పడ్డారు.

గాంధీ ఐదడుగుల ఐదు అంగుళాల ఎత్తుతో 46.7 కేజీల బరువు ఉండేవారని పుస్తకంలో వివరించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం అయితే ఇది అండర్ వెయిట్ (ఉండాల్సిన దానికన్నా తక్కువ) కింద లెక్క. 1925, 1936, 1944లలో గాంధీ మూడు సార్లు మలేరియా వ్యాధి బారిన పడ్డారు. 1919లో పైల్స్, 1924లో అపెండిసైటిస్ ఆపరేషన్లు ఆయనకు జరిగాయి.

ఆయన లండన్ లో ఉన్న సమయంలో ఛాతీలో మంట కారణంగా ఇబ్బంది పడ్డారు. ఆహారం విషయంలో తనపై తాను చేసుకున్న ప్రయోగాలు... దీర్ఘకాల ఉపవాసాల కారణంగా ఆయన ఆరోగ్యం పలుసార్లు దెబ్బతింది. కొన్ని సందర్భాల్లో మరణం అంచుల వరకు కూడా వెళ్లారు. 1937-40 మధ్య కాలంలో చేయించుకున్న ఎలెక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ) రికార్డుల ప్రకారం ఆయనకు గుండె సంబంధిత ఇబ్బందులు లేవు.

More Telugu News