jayalalithaa: జయలలిత బయోపిక్ కోసం దిమ్మతిరిగే పారితోషికాన్ని డిమాండ్ చేసిన కంగనా రనౌత్

  • తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న జయ బయోపిక్
  • రూ. 24 కోట్లు డిమాండ్ చేసిన కంగనా రనౌత్
  • ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న నిర్మాతలు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో 'తలైవి', హిందీలో 'జయ' పేర్లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో జయ పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషిస్తోంది. అయితే, ఈ సినిమా కోసం కంగనా ఏకంగా రూ. 24 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు కూడా దర్శకనిర్మాతలు సుముఖంగా ఉన్నారట. కంగనాకు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో... ఆ మొత్తం ఇచ్చినా, పైసా వసూల్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారని సమాచారం.

More Telugu News