KCR: హైదరాబాద్ లో కూర్చుని కుట్రలు చేయడం కాదు... దమ్ముంటే ఏపీలో అడుగుపెట్టు!: కేసీఆర్ కు సవాల్ విసిరిన కళా

  • వైసీపీ జెండా కింద దాక్కున్నారు
  • దొంగయుద్ధం చేస్తున్నారు
  • కేసీఆర్ కు కళా బహిరంగ లేఖ

ఏపీ మంత్రి కళా వెంకట్రావు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. వైసీపీ జెండా కింద దాక్కుని కేసీఆర్ దొంగ యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ను సామంతరాజుగా చేసుకుని ఏపీ వనరులను కేసీఆర్ దోచుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచే పన్నాగాలు పన్నుతూ ఎన్నికల ప్రక్రియను రావణకాష్టంలా మార్చే కుట్రకు తెరలేపారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో ఆర్థిక మూలాలు ఉన్న వ్యక్తులను బెదిరించి లొంగదీసుకుంటున్నారని కళా వెంకట్రావు తన లేఖలో ఆరోపించారు. ప్రగతిభవన్ ను వేదికగా చేసుకుని వైసీపీకి సహకరించాలంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు.

"గతంలో వైఎస్ కుటుంబాన్ని ఇష్టంవచ్చినట్టు తిట్టిన మీరు ఇప్పుడు అదే వారసత్వాన్ని నెత్తికెత్తుకున్నారు. కృష్ణా-గోదావరి జలాలను దోచుకోవాలనుకుంటున్నారు. నదీ జలాల్లో వాటాలు ఎగ్గొట్టేందుకే జగన్ తో చేయి కలిపారు. ఆనాడు జగన్ ను తెలంగాణ జైళ్లలో పెట్టొద్దని కవిత వ్యాఖ్యానించడం నిజం కాదా? ఇప్పుడదే వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని మీరు తాపత్రయపడుతున్నది నిజం కాదా? డేటా దొంగ కేటీఆర్ ను, గజదొంగ జగన్ తో జతకలిపి తెలుగు రాష్ట్రాలను ఏం చేయదలుచుకున్నారు మీరు? టీడీపీ డేటాను దొంగిలించి జగన్ చేతిలో పెట్టారు. టీడీపీపై బురద చల్లేందుకు సినీ నటులను మీరు ఉసిగొల్పలేదా? హైదరాబాద్ లో కూర్చుని కుట్రలు చేయడం కాదు, దమ్ముంటే ఏపీలో ప్రత్యక్షంగా పోటీచేయాలి" అంటూ కళా సవాల్ విసిరారు.

More Telugu News