Pawan Kalyan: జనసేనతో పొత్తు కటీఫ్... నేడు ప్రకటించనున్న సీపీఐ రామకృష్ణ!

  • పొత్తు ధర్మాన్ని విస్మరించిన పవన్
  • ఉదయం నుంచి నేతలతో రామకృష్ణ మంతనాలు
  • సొంతంగా పోటీ చేయాలంటున్న నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు ధర్మాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తున్న సీపీఐ, రానున్న ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగే ఆలోచనలో ఉంది. జనసేనతో తెగదెంపులు చేసుకోనున్నట్టు నేడు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియా ముందు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తమకు ఇచ్చిన సీట్లలో జనసేన అభ్యర్థులను పెడుతున్నట్టు పవన్ ప్రకటించడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిన్న సాయంత్రం నుంచి పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్న రామకృష్ణ, ఈ ఉదయం వాటిని కొనసాగించారు.

జనసేనతో విడిపోయి, సొంతంగా పోటీ చేసి సత్తా చాటాలని పలువురు సీనియర్ నేతలు సూచించినట్టు తెలుస్తోంది. నూజివీడు, విజయవాడ స్థానాలను సీపీఐకి ఇచ్చినట్టు తొలుత చెప్పిన పవన్ కల్యాణ్, ఆపై వాటిల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించి, వారికి బీ-ఫామ్ లను అందించిన సంగతి తెలిసిందే. తమతో ఏ మాత్రం చర్చించకుండానే పవన్ ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారన్నది సీపీఐ నేతల ప్రధాన ఆరోపణ. కాగా, స్వతంత్రంగా పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించుకుంటే, నామినేషన్లు దాఖలు చేయడానికి రేపు ఒక్కరోజు మాత్రమే సమయం మిగులుతుంది. 

More Telugu News