అఫిడవిట్ లో వెల్లడించిన నారా లోకేశ్ ఆస్తుల వివరాలు

23-03-2019 Sat 18:07
  • నారా లోకేశ్ ఆస్తులు దాదాపు రూ. 320 కోట్లు
  • స్థిరాస్తులు రూ. 253 కోట్లు, చరాస్తులు రూ. 66 కోట్లు
  • ఒక్క పోలీసు కేసు కూడా లేదు

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏపీ మంత్రి నారా లోకేశ్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆయన తన స్థిర, చరాస్తుల వివరాలను వెల్లడించారు. అఫిడవిట్ ప్రకారం లోకేశ్ ఆస్తులు దాదాపు రూ. 320 కోట్లు. వీటిలో రూ. 253.68 కోట్ల స్థిరాస్తులు, రూ. 66.76 కోట్ల చరాస్తులు ఉన్నాయి. లోకేశ్ పై ఒక్క పోలీసు కేసు కూడా లేదు. ఎలాంటి కేసులు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థుల్లో లోకేశ్ ఒకరిగా నిలిచారు.