Andhra Pradesh: శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం: కుటుంబరావు

  • ఫీజ్ రీయింబర్స్ బకాయి ఏదో కొంచెం ఉంది
  • అందుకు,నానా కహానీలు చెబుతున్నారు
  • సంబంధిత పత్రాలతో అమరావతికి రండి

ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకం 2004- 2009, 2009-2014 వరకు ఏ విధంగా నడిచింది, ఆ తర్వాత 2014 -2019 వరకు ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించిందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేశామని అన్నారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా, ఏదో కొంచెం బాకీ ఉంటే, నానా కహానీలు చెబుతున్నారని మోహన్ బాబుపై విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి ఎంత బాకీ ఉందో, సంబంధిత పత్రాలతో అమరావతికి వస్తే, మిగిలిన కాలేజీలతో పాటు శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థలకు కూడా బకాయిలు చెల్లిస్తామని కుటుంబరావు హామీ ఇచ్చారు. 

More Telugu News