Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో హారర్ చిత్రంలో తమన్నా 
  • 'డియర్ కామ్రేడ్'కి మంచి బిజినెస్ 
  • తెలుగులోకి సాయిపల్లవి మలయాళ సినిమా 

*  మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఓ హారర్ సినిమా చేస్తోంది. ఇప్పటికే 'రాజుగారిగది 3' హారర్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన తమన్నా తాజాగా, తమిళంలో మరో హారర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రోహన్ వెంకటేశన్ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది.
*  విజయ్ దేవరకొండ నటిస్తున్న 'డియర్ కామ్రేడ్' చిత్రం నైజాం ప్రాంతంలో మంచి బిజినెస్ చేసిందట. ఆ ప్రాంత థియేటిరికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ 7.6 కోట్లకు తీసుకున్నట్టు తెలుస్తోంది. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.
*  సాయిపల్లవి ప్రస్తుతం మలయాళంలో 'అతిరన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఫాహద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా అనువదించి ఏకకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More Telugu News