New Delhi: ఎయిరిండియా సిబ్బందిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తికి ఎన్నికల్లో టికెట్ నిరాకరణ

  • రవీంద్ర గైక్వాడ్ కు షాకిచ్చిన శివసేన
  • తొలి జాబితా ప్రకటన
  • 21 మందిలో సిట్టింగ్ ఎంపీ పేరు లేని వైనం

రెండేళ్ల క్రితం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చేయిచేసుకున్న ఎంపీ రవీంద్ర గైక్వాడ్ (59) కు దిగ్భ్రాంతికర పరిస్థితి ఎదురైంది. లోక్ సభ ఎన్నికల కోసం శివసేన ప్రకటించిన 21 మంది అభ్యర్థుల జాబితాలో రవీంద్ర గైక్వాడ్ పేరు లేదు. గైక్వాడ్ కు శివసేన అధినాయకత్వం టికెట్ నిరాకరించింది.

ఉస్మానాబాద్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న గైక్వాడ్ ఢిల్లీ ఘటన తర్వాత విమాన ప్రయాణాలపై స్వల్పకాలిక నిషేధం ఎదుర్కొన్నారు. అయితే, ఎంపీ తీరుతో శివసేన వర్గాలు అప్పట్లోనే తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఎంపీపై అప్పట్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోయినా, తాజాగా ఎన్నికల్లో టికెట్ నిరాకరణ ద్వారా క్రమశిక్షణే ముఖ్యమని సేన వర్గాలు చాటిచెప్పాయి. రవీంద్ర గైక్వాడ్ స్థానంలో ఉస్మానాబాద్ నియోజకవర్గ లోక్ సభ అభ్యర్థిగా ఓమ్ రాజే నింబాల్కర్ పేరును ప్రకటించాయి.

More Telugu News