stock market: ఎనిమిది రోజుల సెన్సెక్స్ లాభాలకు బ్రేక్

  • వారాన్ని నష్టాలతో ముగించిన మార్కెట్లు
  • 222 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 64 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభాల్లో కొనసాగిన సెన్సెక్స్ నేడు నష్టాల్లోకి జారుకుంది. రియలన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా, మారుతీ సుజుకీలాంటి భారీ కంపెనీల షేర్లు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 222 పాయింట్లు కోల్పోయి 38,164కు పడిపోయింది. నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 11,456 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.67%), ఎల్ అండ్ టీ (1.54%), ఏషియన్ పెయింట్స్ (1.08%), టాటా స్టీల్ (0.90%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.53%).

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-2.47%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.44%), మారుతి సుజుకీ (-1.84%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.76%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.19%).

More Telugu News