dhruv: 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా 'ఆదిత్య వర్మ' .. ధృవ్ తండ్రి పాత్రలో ప్రముఖ దర్శకుడు

  • ధృవ్ హీరోగా 'ఆదిత్యవర్మ' 
  • హీరోయిన్ గా బనిత సంధు
  • వచ్చే ఏడాది విడుదల        

తెలుగులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా చేసిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. తమిళంలో ఈ సినిమాను ధృవ్ హీరోగా బాలా దర్శకత్వంలో .. 'వర్మ' అనే టైటిల్ తో రీమేక్ చేశారు. అయితే నిర్మాతలకి అవుట్ పుట్ నచ్చకపోవడం వలన, ఆ పుటేజ్ ను మొత్తం పక్కన పెట్టేసి, గిరిసాయి దర్శకత్వంలో 'ఆదిత్యవర్మ' టైటిల్ తో మళ్లీ నిర్మిస్తున్నారు.

అంతకుముందున్న హీరోయిన్ ను కూడా మార్చేసి, బాలీవుడ్ నుంచి 'బనిత సంధు'ను ఎంపిక చేసుకున్నారు. అలాగే ఈ సినిమాలో ధృవ్ తండ్రి పాత్ర కోసం కొంతమంది నటుల పేర్లను పరిశీలించి, కొత్తదనం కోసం ఆ పాత్రకి ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ను తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చకచకా జరిగిపోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

More Telugu News