Arunachal Pradesh: చైనా సరిహద్దు గ్రామంలో ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రం... 39 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిందే!

  • అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్యేకత ఇది
  • మలోగాం గ్రామంలో సోకెలా తయాంగ్‌ అనే మహిళా ఓటరు
  • ఆమె కోసం తరలివెళ్లనున్న పోలింగ్‌ సిబ్బంది

ఓటు వజ్రాయుధం... ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించుకునే హక్కు ఓటరుదే. ఓటరు తన ఓటు హక్కు వినియోగించునే అవకాశం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. దీన్ని గుర్తెరిగే ఎన్నిక సంఘం చైనా సరిహద్దులోని ఓ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఓటు కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సిబ్బందిని తరలిస్తోంది.

వివరాల్లోకి వెళితే... చైనా సరిహద్దున అరుణాచల్‌ప్రదేశ్‌ లోని అంజా జిల్లా ఉంది. ఈ జిల్లా హయులియాంగ్‌లోని మలోగాం గ్రామంలో సోకెలా తయాంగ్‌ అనే మహిళా ఓటరు ఉంది. ఇదే గ్రామంలో మరికొందరు ఓటర్లు ఉన్నా వారందరి ఓట్లు వేరే కేంద్రంలో ఉన్నాయి. దీంతో సోకెలా కోసమే ప్రత్యేకంగా ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇందుకోసం ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారి, భద్రతా సిబ్బంది, పోర్టర్లతో కూడిన బృందం 39 కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లనున్నారు. కాలినడకన ఈ గ్రామానికి చేరుకునేందుకు ఓ రోజు పడుతుంది. 2014లో సోకెలాతోపాటు ఆమె భర్తకు ఇక్కడ ఓటు హక్కు ఉండేది. ప్రస్తుతం ఆమె భర్త ఓటు వేరే కేంద్రానికి మారిందని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి లికెన్‌ కేయూ చెప్పారు.

More Telugu News